Cricket: క్రికెట్ బుకీల వేధింపులు.. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు

Young man suicide arrempt after being harassed by cricket bookies
  • క్రికెట్ బుకీల వ‌ల‌లో దుర్గాప్ర‌సాద్‌
  • బుకీల‌కు రూ.1.80 ల‌క్ష‌లు బాకీ ప‌డ్డ బాధితుడు
  • వేధింపులు తాళ‌లేక పురుగుల మందు తాగిన వైనం
క్రికెట్‌ బుకీల ఆగ‌డాలు ఏమాత్రం త‌గ్గిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. గ‌తంలో మాదిరే త‌మ వ‌ల‌కు చిక్కిన యువ‌కుల‌ను వేధించుకు తింటున్నారు. ఈ త‌ర‌హా వేధింపులు తాళ‌లేక ఓ యువ‌కుడు ఏకంగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మంగ‌ళ‌వారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

జిల్లాలోని తాడేప‌ల్లిగూడెం మండ‌లం క‌డియ‌ద్ద‌కు చెందిన దుర్గా ప్ర‌సాద్ అనే యువ‌కుడు క్రికెట్ బుకీల వ‌ల‌కు చిక్కాడు. ఈ క్ర‌మంలో అత‌డు బుకీల‌కు రూ.1.80 ల‌క్ష‌లు బాకీ ప‌డ్డాడ‌ట‌. ఈ డ‌బ్బు కోసం బుకీలు నిత్యం దుర్గాప్ర‌సాద్‌కు ఫోన్లు చేసి వేధిస్తున్నార‌ట‌. దీంతో వారి వేధింపులు తాళ‌లేక దుర్గాప్ర‌సాద్ మంగ‌ళ‌వారం పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. అయితే స‌కాలంలో గుర్తించిన త‌ల్లిదండ్రులు అత‌డిని తాడేప‌ల్లిగూడెం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
Cricket
Cricket Bookies
Suicide Attempt
West Godavari District

More Telugu News