Rashmika Mandanna: దిల్ రాజు చిత్రంలో విజయ్ కి జోడీగా రష్మిక ఖరారు

Rashmika Mandanna set to appear in Vijay next project with Dil Raju and Vamshi Paidipally
  • త్వరలో పట్టాలెక్కనున్న విజయ్ 66వ చిత్రం
  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిత్రం
  • నిర్మాతగా దిల్ రాజు
  • విజయ్ పక్కన ఓకే చెప్పిన రష్మిక

భారత్ లో ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమల సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒక భాషకు చెందిన హీరోలు మరో భాషలో స్ట్రెయిట్ చిత్రాలు చేస్తుండడం, అలాగే దర్శకులు, నిర్మాతలు కూడా పరభాషా హీరోలతో సినిమాలు చేస్తుండడం ప్రస్తుత ట్రెండ్. తద్వారా  పాన్ ఇండియా సినిమా ఒరవడి మరింత విస్తరిస్తోంది.  

ఈ కోవలోనే... టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు తమిళ అగ్రహీరో విజయ్ తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. కాగా, ఈ సినిమాలో విజయ్ కి జోడీగా అందాలభామ రష్మిక మందన్న పేరు ఖరారైంది. ఈ బహుభాషా చిత్రం కోసం రష్మిక ఓకే చెప్పింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. విజయ్ కి ఇది 66వ సినిమా. 

ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 13న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News