తెలంగాణలో 17 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
- గత 24 గంటల్లో 15,675 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 12 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 36 మంది
- ఇంకా 271 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,345 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,963 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 271 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
