Varalakshmi Sharath Kumar: సైకలాజికల్ థ్రిల్లర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ 'శబరి'

Varalakshmi Sharath Kumar in Sabari movie
  • బహు భాషా చిత్రంగా 'శబరి'
  • విభిన్నమైన పాత్రలో వరలక్ష్మి   
  • ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • దర్శకుడిగా అనిల్

ఒక వైపున నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ దూసుకుపోతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఆమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో బాలకృష్ణ -  గోపీచంద్ మలినేని కాంబోతో పాటు, 'యశోద' సినిమాలో కీలకమైన పాత్రను చేస్తోంది.
 
నాయిక ప్రధానమైన కథతో ఆమె తాజా చిత్రమైన 'శబరి'ని ఈ రోజున లాంచ్ చేశారు. మహేంద్రనాథ్ నిర్మాణంలో అనిల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సతీశ్ వేగేశ్న క్లాప్ తో .. బి. గోపాల్ గౌరవ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. హైదరాబాద్ .. వైజాగ్ .. కొడైకెనాల్ ప్రాంతాల్లో షూటింగు జరుపుకోనుంది. గణేశ్ వెంకట్రామన్ .. శశాంక్ .. మైమ్ గోపీ .. ఆశ్రిత వేముగంటి ముఖ్యమైన పాత్రల్లో   కనిపించనున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ ..  హిందీ  భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News