కుమారుడితో కలిసి గ్రామీ అవార్డు వేడుకల్లో ఏఆర్ రెహమాన్
- ఆదివారం రాత్రి వేడుకగా గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం
- లాస్ వెగాస్ వేదికగా జరిగిన వేడుకకు ఏఆర్ రెహమాన్
- కుమారుడితో కలిసి వచ్చిన సంగీత దర్శకుడు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తండ్రీకొడుకుల ఫొటో
అయితే ఎన్నడూ లేని రీతిలో ఈ దఫా వర్ధమాన గాయకుడిగా ఇప్పుడిప్పుడే సినీ రంగంలో నిలదొక్కుకుంటున్న తన కుమారుడు అమీన్‌ను తీసుకుని ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు.
కుమారుడిని గ్రామీ అవార్డుల వేడుకకు తీసుకెళ్లిన రెహమాన్ వేదికపైకి తన కుమారుడిని తీసుకుని వెళ్లి మరీ సెల్ఫీ తీసుకున్నారు.
ఈ ఫొటోను తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రెహమాన్.. ఆ ఫొటోకు "గ్రామీస్" అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఇక తొలిసారిగా ఈ వేడుకలకు హాజరైన అమీన్ కూడా తన తండ్రితో కలిసి దిగిన ఫొటోకు "పేరెంటింగ్" అన్న ట్యాగ్‌ను జత చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.