Ramcharan: చరణ్ సినిమా కోసం పాటకి 10 కోట్లు .. ఫైట్ కి 10 కోట్లు!

shankar and Charan movie update
షార్ట్స్‌లో చూడండి
'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న చరణ్, త్వరలో  'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ సినిమా విడుదల తరువాత చరణ్ పూర్తిస్థాయిలో శంకర్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడని తెలుస్తోంది. ఇంతవరకూ చిత్రీకరించిన సన్నివేశాలు శంకర్ స్థాయికి తగినట్టుగానే ఉన్నాయట. ఈ సినిమాలో ఒక పాట కోసం దాదాపు ఆయన 10 కోట్ల వరకూ ఖర్చు చేయించినట్టుగా చెబుతున్నారు. ఒక ఫైట్ సీన్ కోసం కూడా 10 కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు. 

చరణ్ ఫ్రీ అయ్యాడు కనుక ఇక నుంచి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరగనుందని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా అరవిందస్వామి పేరు వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత గౌతమ్  తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఒక భారీ యాక్షన్ మూవీ చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి.
Go Back to Shorts
Ramcharan
Kiara Adwani
Dil Raju
Shankar Movie

More Telugu News