కొత్త జిల్లాలను ప్రారంభించిన జగన్.. ప్రారంభమైన కార్యకలాపాలు!
- వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించిన జగన్
- రాష్ట్రంలో ఇకపై 23 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు
- ఏపీలో 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు
ఈ క్రమంలో ఇకపై రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఏపీలో 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ఈ ఉదయం 9.05 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఇతర శాఖల జిల్లా అధికారులు బాధ్యతలను చేపట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.