ఫార్వార్డ్ మెసేజ్ లపై కీలక నిర్ణయం తీసుకున్న వాట్సాప్
- గ్రూపుల్లో మెసేజ్ లు ఫార్వార్డ్ చేయడంపై పరిమితి
- ఒక గ్రూపు కంటే మించి ఫార్వార్డ్ చేయడాన్ని నిరోధించే ఫీచర్
- ఇకపై ఒక పర్యాయం మాత్రమే ఫార్వార్డ్
- ప్రస్తుతానికి ప్రయోగాత్మక దశలో ఫీచర్
గ్రూపుల్లో స్పామ్ మెసేజ్ లు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి వాట్సాప్ ఈ చర్యలు తీసుకుంది. ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి కొందరు ఆండ్రాయిడ్ యూజర్లకు బీటా వెర్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.