'పక్కా కమర్షియల్' నుంచి కొత్త పోస్టర్!
- మారుతి నుంచి 'పక్కా కమర్షియల్'
- గోపీచంద్ సరసన రాశి ఖన్నా
- సంగీత దర్శకుడిగా జేక్స్ బిజోయ్
- జులై 1వ తేదీన విడుదల
ఇక ఆ తరువాత గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా అలరించనుంది. ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.
యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. 'జిల్' తరువాత గోపీచంద్ - రాశి ఖన్నా కలిసి నటించిన సినిమా ఇది. సత్యరాజ్ .. రావు రమేశ్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను జూలై 1వ తేదీన విడుదల చేయనున్నారు.