Mike Tyson: 'లైగర్' లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన మహాబలుడు మైక్ టైసన్

Mike Tyson completes dubbing for Liger movie
షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న లైగర్ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా, మైక్ టైసన్ ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, అతడిపై సన్నివేశాలను చిత్రబృందం అమెరికా వెళ్లి షూట్ చేసింది. ప్రస్తుతం లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 

ఈ నేపథ్యంలో, చిత్రయూనిట్ టైసన్ డబ్బింగ్ కు సంబంధించి ఓ వీడియోను పంచుకుంది. డబ్బింగ్ పనులు పూర్తయిన అనంతరం, టైసన్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్ బ్యానర్లపై లైగర్ తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Mike Tyson
Liger
Dubbing
Boxing
Vijay Devarakonda
Puri Jagannadh

More Telugu News