Telangana: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కీల‌క వ్యాఖ్య‌లు

telangana governor comments on praja darbar
  • రాజ్‌భ‌వ‌న్‌లో ఉగాది వేడుక‌ల్లో ప్ర‌సంగించిన త‌మిళిసై
  • వ‌చ్చే నెల నుంచి ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తాన‌ని వెల్ల‌డి
  • రాజ్ భ‌వ‌న్ త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌ని వ్యాఖ్య  
తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది వేళ త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉగాది పండుగ‌ను పుర‌స్క‌రించుకుని రాజ్ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా ప్ర‌సంగించిన త‌మిళిసై కీల‌క వ్యాఖ్య‌లుచేశారు. రాజ్ భ‌వ‌న్ ప‌రిధి ఏమిటో త‌న‌కు తెలుసున‌ని, త‌న‌ను ఎవ‌రూ నియంత్రించ‌లేర‌ని ఆమె చెప్పారు. త‌న‌కు ఎలాంటి ఇగో లేద‌ని కూడా ఆమె తేల్చి చెప్పారు.

వ‌చ్చే నెల నుంచి రాజ్ భ‌వ‌న్‌లో ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆమె..రాజ్ భ‌వ‌న్‌లో ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుస్తాన‌ని వెల్ల‌డించారు. ప్ర‌జా సమ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుంటాన‌ని, ప్ర‌జ‌ల కోసం రాజ్ భ‌వ‌న్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తాను సోద‌రినని, ఉగాది నుంచి తెలంగాణ‌లో న‌వ‌శ‌కం ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆమె తెలిపారు. ప్ర‌భుత్వంతో క‌లిసి తెలంగాణ అభివృద్ధికి పాటుప‌డ‌తాన‌ని గవర్నర్ త‌మిళిసై పేర్కొన్నారు.
Telangana
Telangana Governor
Tamilisai Soundararajan
Raj Bhavan
Ugadi

More Telugu News