Pawan Kalyan: తెలుగు ప్రజలకు శుభకృత్ నామ సంవత్సరాది శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan conveys Ugadi wishes to all Telugu people
  • శుభకృత్ పేరులోనే శుభాలను నింపుకుని ఉందన్న పవన్
  • అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్ష
  • పాలకులలో కరుణ నింపాలని ప్రార్థిస్తున్నట్టు వ్యాఖ్య  
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మన తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శుభకృత్ నామధేయంతో తరలి వచ్చిందని అన్నారు. పేరులోనే శుభాలను కలిగివున్న ఈ శుభకృత్ ఉగాది ప్రజలందరికీ శుభాలను కలుగజేయాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.

పంటలు పుష్కలంగా పండి రైతులు, సమృద్ధిగా వ్యాపారాలు జరిగి వ్యాపారస్తులు, కార్మికులు, వృత్తి ఆధారిత కళాకారులు, సమస్త జనులు సుఖ సంపదలతో విరాజిల్లాలని కోరుకుంటున్నట్టు వివరించారు. 

ధరల పెంపులు, పన్ను పోట్లు లేని పాలనను అందించే విధంగా పాలకులలో కరుణ నింపాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు తన సందేశాన్ని విడుదల చేశారు.
Pawan Kalyan
Ugadi
Wishes
Telugu People
Andhra Pradesh
Telangana
Janasena

More Telugu News