KKR: ఐపీఎల్: పంజాబ్ పై టాస్ గెలిచిన కోల్ కతా

KKR won the toss against Punjab Kings
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • పంజాబ్ జట్టులో రబాడా
  • రబాడా రాకతో కొత్త ఉత్సాహంలో పంజాబ్
ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదిక. ఈ పోరులో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. సఫారీ స్టార్ పేసర్ కగిసో రబాడా పంజాబ్ జట్టులోకి వచ్చాడు. రబాడా కోసం సందీప్ ను తప్పించారు. రబాడా రాకతో పంజాబ్ బౌలింగ్ దళం పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇక, కోల్ కతా జట్టులో షెల్డన్ జాక్సన్ ను తప్పించి శివమ్ మావిని తుదిజట్టులోకి తీసుకున్నారు.
KKR
Toss
Punjab Kings
Wankhede Stadium
Mumbai
IPL

More Telugu News