క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్!.. 50 శాతానికి పెరిగిన ఆక్యుపెన్సీ!
- మహారాష్ట్రలో రేపటి నుంచి కరోనా ఆంక్షలకు చెల్లుచీటి
- ఐపీఎల్ తాజా సీజన్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే
- 25 శాతం ఆక్యుపెన్సీని 50 శాతానికి పెంచిన బీసీసీఐ
- ఏప్రిల్ 6 నుంచి జరిగే మ్యాచ్‌లకు కొత్త నిబంధన వర్తింపు
- బుక్ మై షో ప్రకటన
ఏప్రిల్ 2 నుంచి మహారాష్ట్రలో కరోనా ఆంక్షలను పూర్తిగా సడలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు నెలల పాటు సాగనున్న ఐపీఎల్‌కు చెందిన అన్ని మ్యాచ్‌లూ మహారాష్ట్రలోనే జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసుకున్న బీసీసీఐ.. మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో 50 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 6 నుంచి జరిగే అన్ని మ్యాచ్‌లకు 50 శాతం ఆక్కుపెన్సీ ఉంటుందని, టికెట్లను అందుబాటులో ఉంచినట్లు బుక్ మై షో శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.