Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ వాడిన యువ‌కుడి మృతి

drug addicted younger died
  • డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారిన వైనం
  • గోవాకెళ్లి మ‌రీ డ్ర‌గ్స్ కొనుగోలు
  • మోతాదుకు మించి డ్ర‌గ్స్ సేవ‌నం
  • తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రిలో చేరిక‌
  • చికిత్స పొందుతూనే మ‌ర‌ణించిన వైనం
హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ వాడిన కార‌ణంగా ఓ యువ‌కుడు మృతి చెందిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. మోతాదుకు మించి డ్ర‌గ్స్ వాడిన స‌ద‌రు యువ‌కుడు ఇటీవ‌లే ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు స‌మాచారం. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూనే అత‌డు మ‌ర‌ణించాడు. కొంత‌కాలం క్రితం డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డ్డ స‌ద‌రు యువ‌కుడు.. ఇటీవ‌లే డ్ర‌గ్స్ సేక‌ర‌ణ కోసం గోవాకు వెళ్లాడు. 

గోవాలో డ్ర‌గ్స్ కొనుగోలు చేసుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన ఆ యువ‌కుడు..మోతాదుకు మించి డ్ర‌గ్స్ తీసుకున్నాడు. ఈ క్ర‌మంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన అత‌డిని ఆసుప‌త్రిలో చేర్పించ‌గా..చికిత్స పొందుతూనే అత‌డు మ‌ర‌ణించాడు. ఆ యువ‌కుడికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కాలేదు.
Drugs
Hyderabad
Goa

More Telugu News