Vijay Devarakonda: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన విజయ్ దేవరకొండ 'జనగణమన' టీమ్

Vijay Devarakonda JGM team met defense minister Rajnath Singh in Delhi
  • పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ మరో చిత్రం
  • ఇటీవలే 'జనగణమన' (జేజీఎమ్) లాంచ్
  • ఢిల్లీ వెళ్లిన 'జేజీఎమ్' టీమ్
  • చిత్ర విశేషాలు రాజ్ నాథ్ కు వివరణ
విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, 'జేజీఎమ్' చిత్రబృందం ఢిల్లీలో ప్రత్యక్షమైంది. దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయింది. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, జూపల్లి రామురావు, విషురెడ్డి తదితరులు రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కనున్న 'జనగణమన' చిత్ర విశేషాలను వారు రాజ్ నాథ్ కు వివరించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ 'జేజీఎమ్' టీమ్ ను అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చార్మీ తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకుంది.
.
Vijay Devarakonda
JGM
Rajnath Singh
Puri Jagannadh
Delhi
Tollywood

More Telugu News