K Narayana Swamy: మంత్రి ప‌ద‌వి పోతే హాయిగా ఉంటుంది.. నారాయ‌ణ స్వామి కామెంట్

ap minister narayana swamy comments on cabinet reshuffling
  • కేబినెట్ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌పై మంత్రి కామెంట్స్‌
  • బాధ‌ప‌డ‌టానికి తామేమీ అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని వ్యాఖ్య‌
  • ముందుగా చెప్పిన‌ట్టే మార్పు అన్న నారాయ‌ణ స్వామి
ఏపీ కేబినెట్ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే త‌న కేబినెట్ స‌హ‌చ‌రుల‌కు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 11న త‌న మంత్రివ‌ర్గాన్ని పునర్వ్యవ‌స్థీక‌రించేందుకు జ‌గ‌న్ ముహూర్తం కూడా నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన మంత్రులందరికీ ఉద్వాస‌న త‌ప్ప‌ద‌న్న వార్త‌లూ వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఏపీ అబ్కారీ శాఖ మంత్రిగా ఉన్న వైసీపీ సీనియ‌ర్ నేత నారాయ‌ణ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ప‌ద‌వి నుంచి తీసేస్తే హాయిగా ఉంటుంద‌ని మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. మంత్రి ప‌ద‌వి నుంచి తీసేస్తే బాధ‌ప‌డ‌టానికి తామేమీ అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని కూడా ఆయ‌న అన్నారు. ముందుగా చెప్పిన విధంగానే సీఎం కేబినెట్‌ను మారుస్తున్నారు అంటూ నారాయ‌ణ స్వామి చెప్పుకొచ్చారు.
K Narayana Swamy
Andhra Pradesh
AP Cabinet Reshuffle

More Telugu News