Vishwak Sen: సీక్వెల్ దిశగా 'ఫలక్ నుమా దాస్'

Falaknuma Das Sequel
  • మాస్ కంటెంట్ తో ఎంట్రీ ఇచ్చిన విష్వక్ సేన్ 
  • మాస్ సినిమాలతోనే క్రేజ్
  • ఫ్యామిలీ కథలపై ఆసక్తి 
  • దర్శకుడిగా కూడా బిజీ అయ్యే ఆలోచన

విష్వక్సేన్ .. తెరపైకి దూకుడుగా వచ్చిన హీరో. మాస్ కంటెంట్ తో మాస్ ఆడియన్స్ ను మెప్పించిన హీరో. సాధారణంగా హీరోగా నిలదొక్కుకున్న తరువాత ఎవరైనా డైరెక్షన్ ఆలోచన చేస్తుంటారు. అలాంటిది విష్వక్సేన్ మాత్రం కెరియర్ ఆరంభంలోనే 'ఫలక్ నుమా దాస్' సినిమా చేసి హిట్ కొట్టాడు. 

ఆ తరువాత నటనలోను .. బాడీ లాంగ్వేజ్ లోను తనదైన ప్రత్యేకతను సంతరించుకున్న విష్వక్ సేన్, హీరోగా ఎదగడంపైనే పూర్తి దృష్టి పెట్టాడు. 'పాగల్' సినిమాతో ఆకట్టుకోలేకపోయిన విష్వక్ సేన్, 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు  కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. 

అంతేకాదు .. 'ఫలక్ నుమా దాస్' సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా చెప్పాడు. ఈ సినిమా తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయనున్న విషయాన్ని స్పష్టం చేశాడు. ఇక హీరోగానే కాదు దర్శకుడిగా కూడా విష్వక్ సేన్ వరుస సినిమాలతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడన్న మాట.

  • Loading...

More Telugu News