Vijayawada: విజయవాడలోని పాయకాపురంలో కలకలం.. ఆలయంలో ఉత్సవమూర్తి పంచలోహ విగ్రహం చోరీ

- పునఃనిర్మాణంలో ఉన్న సంతోషి మాత ఆలయంలో చోరీ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ సిబ్బంది
- సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తోన్న క్లూస్ టీమ్, పోలీసులు
ఏపీలో దేవాలయాల విషయంలో విగ్రహాలు చోరీ కావడం వంటి ఘటనలు గతంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అటువంటి ఘటనే మరోసారి విజయవాడలోని పాయకాపురంలోని ఆలయంలో చోటు చేసుకుంది. పునఃనిర్మాణంలో ఉన్న సంతోషి మాత ఆలయంలో చోరీ జరిగింది.
ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆలయంలోని ఉత్సవమూర్తి పంచలోహ విగ్రహం అపహరణకు గురైందని వివరించారు. దీంతో సీసీ కెమెరా దృశ్యాలను క్లూస్ టీమ్, పోలీసులు పరిశీలిస్తున్నారు.