ఏపీ నుంచి తొలిసారి.. లేపాక్షి ఆలయానికి ‘యునెస్కో’ జాబితాలో చోటు!
- ‘యునెస్కో’ తాత్కాలిక జాబితాలో చోటు
- దేశం నుంచి ఎంపికైన మూడింటిలో లేపాక్షి ఒకటి
- మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితా విడుదల
ఇండియా నుంచి మొత్తం మూడు ప్రాంతాలకు యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. అందులో లేపాక్షి ఆలయం కూడా ఉండడం గమనార్హం. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తాత్కాలిక జాబితాలో తొలిసారి స్థానం దక్కినట్టు అయింది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితాను విడుదల చేస్తుంది. అందులో కనుక లేపాక్షి ఆలయానికి చోటు దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఆలయానికి మంచి గుర్తింపు లభిస్తుంది.