గుంటూరు జిల్లా మైనర్ బాలిక అత్యాచారం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న మహిళా కమిషన్
- పేరేచర్లకు చెందిన మైనర్ బాలిక దారుణం
- ఇప్పటిదాకా 64 మంది అరెస్ట్
- నేడు బాధితురాలితో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ
దర్యాప్తులో ఏమైనా లోపాలు ఉన్నాయా? అని ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు అర్బన్ ఎస్పీతోనూ ఆమె మాట్లాడారు. అంతేకాదు, మహిళా కమిషన్ కార్యాలయానికి బాధితురాలి తండ్రిని కూడా పిలిపించి మాట్లాడారు. బాధితురాలిని ఎప్పుడు దత్తత తీసుకున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును విభిన్న కోణాల్లో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. బాధితురాలికి జరిగిన అన్యాయం పరమ దుర్మార్గం అని పేర్కొన్నారు.
పుండుమీద కారంలా ఈ ఘటనను కొందరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని అన్నారు.