తెలంగాణలో తాజాగా 30 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona update
  • గత 24 గంటల్లో 17,806 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 9 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 51 మంది
  • కరోనా మరణాలు నిల్
  • ఇంకా 492 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 17,806 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 9 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు గుర్తించారు. 21 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 52 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,578 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 492 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
.
Go Back to Shorts
Telangana
Corona Virus
Update
Daily Cases

More Telugu News