వారిపై పరువు నష్టం దావాకు అనుమతివ్వండి.. ఏపీ ప్రభుత్వానికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
- చెవిరెడ్డి, సాక్షి మీడియా, సీఎం సీపీఆర్వోలపై పరువు నష్టం దావా ప్రస్తావన
- తప్పుడు ప్రచారంతో తన కుటుంబీకులు చాలా ఇబ్బంది పడ్డారని వ్యాఖ్య
- సాధారణ పరిపాలన శాఖకు లేఖ
- అదే లేఖను సీఎస్‌కు కూడా పంపిన ఏబీవీ
తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా దాఖలు చేయాలనుకుంటున్నానని ఈ లేఖలో ఏబీ పేర్కొన్నారు. తాను పరువు నష్టం దావా దాఖలు చేయాలనుకుంటున్న వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానెల్‌లతో పాటు సీఎం సీపీఆర్వో శ్రీహరి ఉన్నారని ఆయన తెలిపారు. సీఎం సీపీఆర్వో తన సస్పెన్షన్‌పై తప్పుడు సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారని ఆరోపించారు. ఈ విషయాలను మీడియా ప్రసారం చేయడంతో తన కుటుంబీకులు చాలా ఇబ్బంది పడ్డారని ఏబీవీ ఆరోపించారు.