ఏపీలో తాజాగా 27 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Bulletin
  • గత 24 గంటల్లో 8,948 కరోనా పరీక్షలు
  • అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు
  • 6 జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 55 మంది
  • ఇంకా 367 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 8,948 కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 55 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

ఏపీలో ఇప్పటివరకు 23,19,475 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,378 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇంకా 367 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Bulletin
Today Cases

More Telugu News