రామ్ చరణ్ పుట్టినరోజును రాజమౌళి, ఎన్టీఆర్ ఎలా సెలబ్రేట్ చేశారో చూడండి!

  • ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా
  • నేడు రామ్ చరణ్ జన్మదినం
  • చరణ్ నివాసంలో సంబరాలు
  • హాజరైన రాజమౌళి, ఎన్టీఆర్, ప్రణతి
ఆర్ఆర్ఆర్... ఆర్ఆర్ఆర్.... ఆర్ఆర్ఆర్!... ఎక్కడ చూసినా ఇదే మేనియా. ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. రాజమౌళి దర్శకత్వ మాయాజాలం, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనా ప్రతిభ ఈ సినిమాను భారతదేశ సినీ చరిత్రలో ముందు వరుసలో నిలిపాయి. 

కాగా, నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కాగా, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల హంగామా అంతాఇంతా కాదు. రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన, ఎన్టీఆర్ అర్ధాంగి ప్రణతి కూడా ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రణతి పుట్టినరోజు కూడా ఇవాళే కావడంతో ఆమె కూడా కేక్ కట్ చేసి సంబరాల్లో పాలుపంచుకున్నారు. కేక్ తినిపించుకున్న అనంతరం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కేరింతలు కొడుతూ ఆనంద నృత్యం చేశారు. కాగా, ఈ వేడుకలు రామ్ చరణ్ నివాసంలో జరిగినట్టు తెలుస్తోంది.


More Telugu News

Ramcharan Birthday Rajamouli NTR Upasana Pranathi RRR Tollywood