Andhra Pradesh: 90% మంది మంత్రులకు పదవీ గండం.. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు?

AP Cabinet To Be Re Shuffled On April 11
  • ఏప్రిల్ 11న చేపడతారని ప్రచారం
  • మార్పులపై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన సీఎం!
  • ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 11న సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి జగన్ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. 

వాస్తవానికి మంత్రివర్గం రెండున్నరేళ్లే ఉంటుందని, ఆ తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తామని సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న 2019లోనే పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడున్న వారిలో 90 శాతం మంది తమ బెర్తులను కోల్పోబోతున్నారని అంటున్నారు. 

ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావహులు.. 

తొలి విడతలో అవకాశం దక్కని వారికి రెండో విడతలో అవకాశం ఇచ్చేందుకు జగన్ కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. దీంతో చాలా మంది ఆశావహులు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు చాలా మంది మంత్రుల్లో తమ పదవి పోతుందన్న భయం పట్టుకుందని చెబుతున్నారు. 

అయితే, పదవులు పోయిన వారికి జిల్లాలకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తామని, పార్టీ కోసం పనిచేయాలని ఇదివరకే మంత్రులకు జగన్ సూచించారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
AP Cabinet

More Telugu News