Allu Arjun: 'పుష్ప ' పార్టు 2 మాత్రమే కాదు .. 3 కూడా?

Pushpa 2 update
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో 'పుష్ప' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బన్నీ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు.  

ప్రస్తుతం ఈ సినిమా టీమ్ సెకండ్ పార్టుకు సంబంధించిన కథా చర్చలు చేయడానికి తమిళనాడులోని 'కూనూర్' వెళ్లిందట. అక్కడి నుంచి పూర్తి స్క్రిప్ట్ తోనే తిరిగి వస్తారట. జూన్ లో గానీ .. జులైలోగాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇక కొత్తగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈ సినిమాకి 3వ పార్టు కూడా చేయాలనే ఆలోచనతో సుకుమార్ ఉన్నాడని అంటున్నారు. ఆ దిశగానే సెకండ్ పార్టును తీసుకు వెళ్లనున్నారని చెబుతున్నారు. సెకండ్ పార్టు తరువాత మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత 'పుష్ప 3' చేస్తారట. మొత్తానికైతే చేయడం మాత్రం ఖాయమన్నమాట!
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa Movie

More Telugu News