విజయవాడలో థియేట‌ర్ స్క్రీన్‌తో పాటు అద్దాలు ధ్వంసం చేసిన ఫ్యాన్స్.. వీడియో ఇదిగో

Fans vandalise Annapurna theater in Vijayawada
  • విజ‌య‌వాడ‌లోని అన్న‌పూర్ణ థియేట‌ర్‌లో ఘ‌ట‌న‌
  • సాంకేతిక కార‌ణాల‌తో ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచిపోవ‌డంతో ర‌చ్చ 
  • పోలీసుల‌ను పిలిచిన‌ థియేట‌ర్ యాజ‌మాన్యం
రాజ‌మౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా నేడు విడుదలైన నేప‌థ్యంలో కొన్ని థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ అత్యుత్సాహం కారణంగా ఉద్రిక‌త్త‌లు చోటు చేసుకుంటున్నాయి. విజ‌య‌వాడ‌లోని అన్న‌పూర్ణ థియేట‌ర్‌లో సాంకేతిక కార‌ణాల‌తో ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచిపోవ‌డంతో ఫ్యాన్స్ ర‌చ్చ చేశారు. థియేట‌ర్ తెర, అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. 

దీంతో థియేట‌ర్ యాజ‌మాన్యం పోలీసుల‌ను పిలిపించగా, వారు ప‌రిస్థితులను అదుపులోకి తెచ్చారు. అనంత‌రం స్క్రీన్ రిపేర్ చేసిన థియేట‌ర్ యాజ‌మాన్యం ఆర్ఆర్ఆర్ షోను కొన‌సాగించింది. కాగా, ఫ్యాన్స్ థియేట‌ర్‌లో విధ్వంసానికి పాల్ప‌డిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. మరోపక్క, మరికొన్ని చోట్ల కూడా త‌మ‌కు క‌లుగుతోన్న అసౌకర్యం ప‌ట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఇదే అన్నపూర్ణా థియేట‌ర్‌లో ముందు జాగ్రత్తగా తెర వ‌ద్ద‌ మేకులు కొట్టిన చెక్కలను అమ‌ర్చారు. అంతేగాక‌ తెరవ‌ద్ద‌కు వ‌స్తే అపాయం అని హెచ్చరిక బోర్టులూ పెట్టారు. అయిన‌ప్ప‌టికీ నేడు ఇటువంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.  


   
Go Back to Shorts
Vijayawada
Krishna District
Andhra Pradesh
RRR

More Telugu News