Wiki Leaks: జైలులోనే ప్రేయసిని పెళ్లాడిన వికీలీక్స్ చీఫ్ జూలియన్ అసాంజే

WikiLeaks Chief Julian Assange Marries His Girlfriend In Jail
  • ఆర్మీ రహస్య సమాచారాన్ని లీక్ చేశాడన్న ఆరోపణలపై శిక్ష
  • బ్రిటన్ లోని బెల్మారిష్ జైలులో ఉంటున్న అసాంజే
  • తన ప్రేయసి స్టెల్లా మోరిస్ తో వివాహం
వికీలీక్స్ తో అప్పట్లో పెను రాజకీయ సంచలనమే సృష్టించిన జూలియన్ అసాంజే.. ఓ ఇంటివాడయ్యారు. ఇప్పటికే తన ప్రేయసితో ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఆయన.. ఆమెను జైలులోనే వివాహమాడారు. వికీలీక్స్ లో భాగంగా అత్యంత రహస్యమైన ఆర్మీ సమాచారాన్ని బయటకు లీక్ చేశారన్న కేసుకు సంబంధించి ఆయన 2019 నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బ్రిటన్ లోని బెల్మారిష్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 

జైలులోనే పెళ్లి చేసుకునేందుకు అధికారులు అనుమతినివ్వడంతో తన ప్రేయసి స్టెల్లా మోరిస్ ను ఆయన.. తన పిల్లలు నలుగురు అతిథుల సమక్షంలోనే మనువాడారు. వారి పెళ్లికి ఇద్దరు సాక్షులు, ఇద్దరు గార్డులు వెంట ఉన్నారు. పెళ్లి సందర్భంగా తనకు ఆనందంగానూ..మరోవైపు బాధగానూ ఉందని స్టెల్లా అన్నారు. జూలియన్ ను మనస్ఫూర్తిగా ప్రేమించానని చెప్పారు. వివాహం అనంతరం జైలు గేటు బయట ఆమె.. అసాంజే మద్దతుదారుల నడుమ కేక్ కట్ చేశారు. ప్రభుత్వాలు అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయని, క్రూరంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.  

కేసుకు సంబంధించి అమెరికా అధికారులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో అసాంజే అమెరికా నుంచి పారిపోయి వచ్చారు. వివిధ దేశాల్లో తలదాచుకున్నారు. కొన్నాళ్లు లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఉన్నారు. ఆ క్రమంలోనే 2011లో అక్కడే పనిచేస్తున్న లాయర్ అయిన స్టెల్లాను తొలిసారి కలిశారు. 2015లో ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లాడారు. 

కాగా, ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎక్స్ ట్రాడిషన్ కు సంబంధించి ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దానికి ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటు తనను అమెరికాకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అసాంజే పెట్టుకున్న అర్జీని బ్రిటన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Wiki Leaks
Julian Assange
UK
Britain
USA
Stella Moris

More Telugu News