P.Chidambaram: ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడికి ఊరట.. రెగ్యులర్ బెయిలు మంజూరు

Delhi Court Grants Bail to P Chidambaram and Son in CBI and ED Cases
  • రెగ్యులర్ బెయిలు మంజూరు చేసిన కోర్టు
  • గతంలో లక్షల రూపాయల పూచీకత్తుపై ముందస్తు బెయిలు
  • 2011 నుంచి కొనసాగుతున్న కేసు
ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో  కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఇద్దరికీ రెగ్యులర్ బెయిలు మంజూరు చేస్తూ కోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇంతకుముందు నిందితులిద్దరికీ లక్ష రూపాయల చొప్పున బెయిల్ బాండ్‌లను స్వీకరిస్తూ కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

కోర్టుకు హాజరైన నిందితులు తమకు వ్యతిరేకంగా జారీ అయిన సమన్లను అనుసరించి సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్లను పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా కోరారు. పరిశీలించిన కోర్టు ఇద్దరికీ రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది.

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు వివాదం 2011 నుంచి కొనసాగుతోంది. దీని మూలాలు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో దాగి వున్నాయి. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు సామర్థ్యానికి మించి ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌కు ఆమోదం తెలిపారని, ఫలితంగా కొందరు అనుచిత లబ్ధి పొందారని సీబీఐ, ఈడీలు ఆరోపించాయి.
P.Chidambaram
Karti
Aircel-Maxis scam
Bail

More Telugu News