KCR: కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు కొల్హాపూర్ వెళ్తున్న కేసీఆర్

KCR going to Kolhapur today
  • కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న కేసీఆర్
  • ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న సీఎం
  • సాయంత్రానికి తిరిగి హైదరాబాదుకు చేరుకోనున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు వెళ్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు. కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని వీరు దర్శించుకోనున్నారు. అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. పూజాకార్యక్రమాల అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాదుకు చేరుకుంటారు. ఇప్పటికే కేసీఆర్ మన దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటైన మహాలక్ష్మి అమ్మవారిని ఈరోజు దర్శించుకోనున్నారు.

  • Loading...

More Telugu News