ప్రతి సీన్ ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది: రాజమౌళి
- చారిత్రక నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్'
- ఈ నెల 25వ తేదీన విడుదల
- జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్
- ప్రతి సీన్ ఒక అద్భుతమన్న రాజమౌళి
తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ .. " ఈ సినిమాలో ట్రైన్ బ్లాస్ట్ సీన్ ఉంటుంది. మినియేచర్ సెట్ వేసి .. సీజీలో కంపార్ట్ మెంట్ ను బ్లాస్ట్ చేయడం జరిగింది. ఈ సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ఇది తెరపై చాలా సహజంగా .. భారీగా కనిపిస్తుంది. ఈ సీన్ చూస్తూ అంతా కూడా విస్మయానికి లోనవుతారు.
ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే, దీనిని ఎలా తీశారబ్బా? అనే ఆలోచన చేస్తూనే ఉంటారు. అంతగా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. అడుగడుగున ఎదురయ్యే అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ ఫీల్ ను పదే పదే పొందడానికి మళ్లీ మళ్లీ థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు" అని చెప్పుకొచ్చారు.