బోయగూడ ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం
- ప్రమాదంలో 11 మంది సజీవ దహనం
- మరో ఇద్దరి ఆచూకీ గల్లంతు
- మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమయంలో అందులో 15 మంది నిద్రిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బయటపడ్డారు. 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.