Petrol: వరుసగా రెండో రోజూ పెరిగిన పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో రూ. 110కి చేరిన పెట్రోలు

Petro Rates hiked consecutive second day
షార్ట్స్‌లో చూడండి
నిన్న మొదలైన పెట్రో బాదుడు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. ఫలితంగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు రూ. 110కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.36కి చేరుకుంది.

ఏపీలో పెట్రోలుపై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. దీంతో గుంటూరులో లీటరు పెట్రోలు ధర రూ. 112.08కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.10కి పెరిగింది. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగైదు నెలలపాటు స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ నిన్న చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
Go Back to Shorts
Petrol
Diesel
Price Hike
Andhra Pradesh
Telangana

More Telugu News