మహిళా డాక్టర్ మీద సామూహిక అత్యాచారం
- మహిళా డాక్టర్ పై నలుగురు సామూహిక అత్యాచారం
- స్నేహితుడిని బెదిరించి గ్యాంగ్ రేప్
- తమిళనాడు వేలూరు సమీపంలో దారుణ ఘటన
అప్పటికే ఆటోలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారంతా సత్ వచ్చారికి వచ్చిన తర్వాత ఆటోను మరో రోడ్డుకు తరలించారు. ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అనంతరం యువతి స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి తరిమేశారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.