Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా డాక్టర్ మీద సామూహిక అత్యాచారం

Lady doctor gang raped in Tamil Nadu
  • మహిళా డాక్టర్ పై నలుగురు సామూహిక అత్యాచారం
  • స్నేహితుడిని బెదిరించి గ్యాంగ్ రేప్
  • తమిళనాడు వేలూరు సమీపంలో దారుణ ఘటన
తమిళనాడులోని వేలూరు సమీపంలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా డాక్టర్ పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, వేలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువతి డాక్టర్ గా పని చేస్తోంది. మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి కాట్పాడిలోని సినిమా థియేటర్ లో సెకండ్ షో చూసింది. అనంతరం తన స్నేహితుడితో కలిసి షేరింగ్ ఆటోలో వేలూరుకు తిరుగుపయనమయింది. 

అప్పటికే ఆటోలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారంతా సత్ వచ్చారికి వచ్చిన తర్వాత ఆటోను మరో రోడ్డుకు తరలించారు. ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అనంతరం యువతి స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి తరిమేశారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Woman Doctor
Tamil Nadu
Gang Rape

More Telugu News