సల్మాన్ ఖాన్ జింకల వేట కేసు రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ
- సల్మాన్ ను ఇప్పటికీ వెంటాడుతున్న కృష్ణజింకల వధ కేసు
- 1998లో ఘటన
- 2018లో సల్మాన్ ను దోషిగా నిర్ధారించిన జోథ్ పూర్ కోర్టు
- బెయిల్ పొందిన సల్మాన్ ఖాన్
'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ రాజస్థాన్ లో జరిగిన సమయంలో సల్మాన్ తన సహనటులతో కలిసి కృష్ణజింకలను వేటాడినట్టు అభియోగాలు మోపారు. సల్మాన్ పై 9/51 ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తో పాటు ఆయుధాల చట్టంలోని 3/25, 3/27 సెక్షన్లతో కేసు నమోదైంది.
ఈ కేసులో సల్మాన్ ను దోషిగా నిర్ధారిస్తూ 2018లో జోథ్ పూర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే సల్మాన్ ఆ తర్వాత బెయిల్ పొందాడు. తొలుత ఈ కేసులో సల్మాన్ తో పాటు సైఫ్ ఆలీ ఖాన్, సోనాలీ బెంద్రే, నీలమ్, టబులపైనా చార్జిషీటు దాఖలైంది. పలు దఫాల విచారణ అనంతరం వారు నిర్దోషులుగా బయటపడ్డారు.