రాజధాని రక్షణ కోసం తుపాకీ పట్టిన టెన్నిస్ స్టార్
- టెన్సిస్‌లో సత్తా చాటిన సెర్గీ
- ఇటీవలే ఆటకు గుడ్‌బై
- కీవ్‌కు రక్షణగా గస్తీ కాస్తున్న వైనం
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన సెర్గీ ప్రస్తుతం తుపాకీ చేతబట్టి తమ రాజధాని నగరంలోకి రష్యా సైనికులు ప్రవేశించకుండా గస్తీ కాస్తున్నారు. గతంలో టెన్నిస్‌లో ఓ వెలుగు వెలిగిన సెర్గీ ఆటకు ఈ ఏడాదే గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన దేశాన్ని, దేశ రాజధానిని కాపాడుకునేందుకే తాను తుపాకీ పట్టానని, నిత్యం పలుమార్లు తుపాకీ చేతబట్టి నగరానికి గస్తీ కాస్తున్నట్లు అతడు తెలిపాడు.