'శ్రీకృష్ణ' డెయిరీని చేజిక్కించుకున్న ఫలితం.. రివ్వున ఎగసిన 'దొడ్ల' డెయిరీ షేర్ విలువ
- శ్రీకృష్ణ డెయిరీని టేకోవర్ చేసిన దొడ్ల డెయిరీ
- రూ.50 కోట్లకు కుదిరిన డీల్
- రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి
1989లో కర్ణాటకలో కార్యకలాపాలు ప్రారంభించిన శ్రీకృష్ణ డెయిరీ.. ఆ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ డెయిరీగా రికార్డులకెక్కింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ.67 కోట్ల టర్నోవర్‌ను సాధించిన ఈ సంస్థ.. అంతకుముందు ఏడాదిలో ఏకంగా రూ.76 కోట్ల టర్నోవర్‌ను అందుకుంది. ఈ డెయిరీని డొడ్ల డెయిరీ కేవలం రూ.50 కోట్లకే టేకోవర్ చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియ రెండు నెలల్లో పూర్తి కానున్నట్లుగా దొడ్ల డెయిరీ శనివారం నాడు ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలోనే సోమవారం దొడ్ల డెయిరీ షేర్ 19 శాతం మేర మేర పెరిగి రూ.548ని తాకింది.