Britain: ఉక్రెయిన్ పై శక్తిమంతమైన ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా... అణ్వస్త్రాలు బయటికి తీసిన బ్రిటన్!

  • రష్యా దాడులకు భయపడిన ఉక్రెయిన్
  • యుద్ధరంగంలో తీవ్ర ప్రతిఘటన
  • రష్యా అణుదాడికి దిగొచ్చని పలుదేశాల అనుమానాలు
  • సన్నద్ధమవుతున్న నాటో దేశాలు
Britain transports nuke warheads to Coulport

గత మూడు వారాలకు పైగా ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా, కొన్నిరోజుల నుంచి శక్తిమంతమైన ఆయుధాలను ప్రయోగిస్తోంది. వాటిలో కింజాల్ వంటి హైపర్ సోనిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్ లొంగకపోగా, తీవ్రంగా ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో రష్యా మున్ముందు మరింత ప్రమాదకర ఆయుధాలు ఉపయోగించే అవకాశాలున్నాయని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాటో దేశాలు సైతం ఇదే అంచనాలతో ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో, ఆసక్తికరంగా బ్రిటన్ లో అణ్వస్త్ర కదలికలు కనిపించాయి. తన ట్రైడెంట్ ఇంటర్ కాంటినెంటల్ మిస్సైళ్లకు ఉపయోగించే అణు వార్ హెడ్లను బ్రిటన్ బయటికి తీసింది. ఆల్మెర్మస్టోన్ అణ్వాయుధాగారం నుంచి వీటిని కొన్ని ట్రక్కుల్లో కోల్ పోర్టులోని రాయల్ నేవీకి చెందిన ఆర్డినెన్స్ డిపోకు తరలించారు. 

ట్రైడెంట్ క్షిపణులకు అణు వార్ హెడ్లను తగిలించి ప్రయోగిస్తారు. వీటిని సబ్ మెరైన్ల నుంచి ప్రయోగిస్తారు. ఉక్రెయిన్ ను ఎలాగైనా లొంగదీయాలన్న పట్టుదలతో ఉన్న రష్యా... అణ్వస్త్ర ప్రయోగానికి వెనుకాడకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో, బ్రిటన్ కీలక వార్ హెడ్లను నేవీకి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ప్రపంచదేశాల అణుకదలికలపై నిఘా వేసే 'క్ వాచ్' సంస్థ ఇది సాధారణ తరలింపు ప్రక్రియ మాత్రమేనని అంటోంది.

  • Loading...

More Telugu News