Plane: చైనాలో ఘోర విమాన ప్రమాదం

Passenger Plane crashed in Southwest China
  • 133 మందితో వెళుతున్న విమానం
  • వూజో సిటీ సమీపంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలిన వైనం
  • కొండపై భారీ అగ్నిప్రమాదం
  • హుటాహుటీన తరలివెళ్లిన సహాయక బృందాలు

చైనాలో ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. నైరుతి చైనాలో ఈ ఘటన జరిగింది. ఈ బోయింగ్-737 విమానం గ్వాంగ్జీ ప్రావిన్స్ గగనతలంలో ప్రయాణిస్తుండగా వూజో నగరం సమీపంలోని గ్రామీణ ప్రాంతాలో కూలిపోయింది. ఈ విమానంలో 133 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. విమానం ఓ కొండపై కూలిపోగా, అక్కడ అగ్నిప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. 

ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటీన సహాయక బృందాలను తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన తీరు, విమానం కూలిపోయిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా అందులోని వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News