బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన కృతి శెట్టి
- బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న 'శ్యామ్ సింగరాయ్'
- హీరోగా నటిస్తున్న షాహిద్ కపూర్
- కృతి శెట్టి పాత్రకు ఆమెనే తీసుకున్న మేకర్స్
మరోవైపు కృతి శెట్టికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఆమె బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిందనేదే ఆ వార్త సారాంశం. నాని, కృతి శెట్టి, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన 'శ్యామ్ సింగరాయ్' చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నాడు. తెలుగులో కృతి శెట్టి పోషించిన పాత్రను హిందీ రీమేక్ లో కూడా ఆమే చేయాలని చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిందట. హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఇది మంది అవకాశం అని భావించిన కృతి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.