బోధన్ లో హిందూ యువకులపై దాడి దారుణం: బండి సంజయ్
- బోధన్ లో రాత్రికిరాత్రే శివాజీ విగ్రహ ప్రతిష్టాపన
- తీవ్రంగా వ్యతిరేకించిన ఓ వర్గం
- ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం
- బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
ఈ పరిస్థితులపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. బోధన్ లో హిందూ యువకులపై దాడి దారుణమని పేర్కొన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్, పోలీసులు కలిసి ఈ దాడికి పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. బోధన్ లో శివాజీ విగ్రహ స్థాపన కోసం మున్సిపాలిటీ తీర్మానం కూడా చేసిందని స్పష్టం చేశారు. రాళ్లదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సీపీ నానా బూతులు తిట్టి, లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. సీపీ ఓ రౌడీలా వ్యవహరిస్తున్నారని, పోలీసులు గాల్లో రబ్బరు బుల్లెట్లు కాల్చారని పేర్కొన్నారు.