Pawan Kalyan: నిన్న‌టి 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో క‌ల‌క‌లం.. వీడియోలు వైర‌ల్

janasena flags at rrr event
  • ట‌వ‌ర్ పైకి ఎక్కిన అభిమానులు
  • ఇద్ద‌రు హీరోల జెండాలు ఎగ‌రేస్తూ గొడ‌వ‌
  • కింద‌కు దిగాలని చెప్పినా విన‌కుండా అల‌జ‌డి
నిన్న‌టి ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఇందుకు సంబంధించిన‌ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. కర్ణాటక, ఏపీ సరిహద్దులోని చిక్కబళ్లాపూర్ లో ఈ ఈవెంట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇందులో పలువురు హీరోల అభిమానులు ర‌చ్చ ర‌చ్చ చేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన ట‌వ‌ర్ పైకి ఎక్కిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు జ‌న‌సేన జెండాలు ఎగ‌రేశారు. 

అలాగే, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో ఉన్న జెండాల‌ను కూడా ఎగ‌రేశారు. వాటిని కొంద‌రు తొల‌గించారు. మ‌రో హీరో జెండాలు ఎగ‌రేశారు. దీంతో కాసేపు అక్క‌డ ఉద్రిక్తత నెల‌కొంది. ట‌వ‌ర్ పై నుంచి కింద‌కు దిగాలని నిర్వాహ‌కులు సూచించిన‌ప్ప‌టికీ అభిమానులు వినిపించుకోలేదు.    



                 

Pawan Kalyan
RRR
Junior NTR
Ramcharan
Janasena

More Telugu News