తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 20,496 కరోనా పరీక్షలు
- కొత్తగా 67 కేసుల నమోదు
- హైదరాబాదులో 31 మందికి పాజిటివ్
- 17 జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- ఇంకా 713 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,90,756 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,85,932 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 713 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.
