ఓ ఆటోలో కూర్చుని చాయ్ తాగుతూ దర్శనమిచ్చిన కొడాలి నాని, వంగవీటి రాధా... ఫొటోలు ఇవిగో!

  • గుడివాడలో రాజకీయనేత  అడపా వెంకటరమణ మృతి
  • అంతిమయాత్రలో పాల్గొన్న నాని, రాధా
  • ఇరువురి మధ్య మాటామంతీ
ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని, వంగవీటి రాధా ఇద్దరూ ప్రత్యేకమైన వ్యక్తులే. కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాగా, వంగవీటి రాధా టీడీపీ నేత. అయితేనేం... వీరిద్దరూ పార్టీలకు అతీతంగా తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. వైసీపీ, టీడీపీ నేతలు అనేక అంశాలపై పరస్పరం తిట్టిపోసుకోవడం కామన్. కానీ కొడాలి నాని, రాధాల అనుబంధంపై ఆ ప్రభావం ఉండదు. అందుకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. తాజా ఘటన కూడా అలాంటిదే. 

కొడాలి నాని, రాధా గుడివాడలో మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్  అడపా వెంకట రమణ (బాబ్జి) అంతిమ యాత్రలో పాల్గొన్నారు. బాబ్జి ఆకస్మిక మృతికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారిద్దరూ అతి సాధారణంగా ఓ ఆటోలో కూర్చుని ఛాయ్ తాగుతూ కనిపించారు.

గత కొంతకాలంగా కొడాలి నాని తన స్నేహితుడు రాధాను వైసీపీలోకి తీసుకు రావాలని భావిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల కధనాలలో తరచుగా వినిపిస్తున్న మాట. అది కథనాలకే పరిమితమైంది తప్ప కార్యరూపం దాల్చిందిలేదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టీడీపీ నాయకులతో వంగవీటి ఇంతలా కలివిడిగా ఉన్న దృశ్యాలు అత్యంత అరుదైన విషయం అని చెప్పాలి. 
.

Kodali Nani
Vangaveeti Radha
Adapa Venkataramana
Gudivada
YSRCP
TDP

More Telugu News