Mahabubabad District: కార్యకర్తల నోట్లో మద్యం పోస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హోలీ వేడుకలు.. తప్పేముందున్న శంకర్‌నాయక్

TRS MLA Shankar Nayak Served liquor in Holi celebrations
  • మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు
  • మద్యం పోస్తున్న ఫొటోలు వైరల్
  • ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించలేదన్న శంకర్ నాయక్
మహబూబాబాద్‌లో జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ స్వయంగా కార్యకర్తల నోట్లో మద్యం పోయడం విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యే మద్యం పోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిన్న తన క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు నిర్వహించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా మద్యం బాటిల్ పట్టుకుని కార్యకర్తల నోట్లో మద్యం పోశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన ఎమ్మెల్యే.. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. అందరం కలిసి ఆనందంగా హోలీ జరుపుకున్నామని, ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించలేదని వివరణ ఇచ్చారు.
Mahabubabad District
TRS
Shankar Nayak
Holi

More Telugu News