Uttar Pradesh: 25న‌ యూపీ సీఎంగా యోగి ప్ర‌మాణం!

yogi adityanath will take oath as uttar pradesh cmon 25th of this month
  • ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బీజేపీ
  • యూపీ సీఎంగా మ‌రోమారు యోగికి అవ‌కాశం
  • 25న సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం
ఉత్త‌రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్య నాథ్ వ‌రుస‌గా రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇటీవ‌లే ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌తంలో కంటే సీట్ల సంఖ్య త‌గ్గినా.. బీజేపి వ‌రుస‌గా రెండోసారి రికార్డు విక్ట‌రీ న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో యోగి కూడా మంచి మెజారిటీతో విజ‌యం సాధించిన విష‌యం విదిత‌మే.

తాజాగా బీజేపీ అధిష్ఠానం ఉత్త‌రప్ర‌దేశ్ సీఎంగా మ‌రోమారు యోగిని ఎంపిక చేసింది. అంతేకాకుండా ఈ నెల 25న సీఎంగా యోగి ఆదిత్యనాధ్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లుగా కూడా పార్టీ ప్ర‌క‌టించింది. ఈ నెల 25న సాయంత్రం 4 గంట‌ల‌కు యూపీ సీఎంగా వ‌రుస‌గా రెండోసారి యోగి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.
Uttar Pradesh
Yogi Adityanath
BJP

More Telugu News