Andhra Pradesh: ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

AP records 75 Corona cases
ఏపీలో కరోనా మహమ్మారి కట్టడిలో ఉంది. గత 24 గంటల్లో 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 46 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు.

 తాజాగా నమోదైన కేసుల్లో అనంతపురం జిల్లాలో అత్యధికంగా 23 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,19,141కి చేరుకుంది. వీరిలో 23,03,875 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,730 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 536 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

Andhra Pradesh
Corona Virus
Update

More Telugu News