Sharmila: పాద‌యాత్ర‌లో ష‌ర్మిల‌కు రంగులు పూసిన మ‌హిళ‌లు.. వీడియో ఇదిగో

sharmila celebrates holi
  • యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో పాద‌యాత్ర‌
  • చేనేత కుటుంబాల‌ను క‌లిసిన ష‌ర్మిల‌
  • ప్ర‌జ‌ల‌కు ష‌ర్మిల హోలీ శుభాకాంక్ష‌లు
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ప్ర‌స్తుతం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని భూదాన్ పోచంపల్లి మండలంలో జ‌రుగుతోంది. మార్కండేయ నగర్ లో చేనేత కుటుంబాల‌ను ఆమె క‌లిశారు. 

హోలీ పండుగ‌ సంద‌ర్భంగా ఆమెకు అక్క‌డి మ‌హిళ‌లు రంగులు పూశారు. అనంత‌రం బొట్టు పెట్టారు. ప్ర‌జ‌ల‌కు ష‌ర్మిల హోలీ శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా, ష‌ర్మిల రాష్ట్ర‌ ప్రజా సమస్యలు తెలుసుకుని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు.
Sharmila
YSRTP
Telangana

More Telugu News